కోలుకోవడాన్నిచూపుతున్న హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ యొక్క ‘లైఫ్ ఫ్రీడమ్ ఇండెక్స్

– కోవిడ్ తర్వాత వినియోగదారుల ఆర్థిక ఔట్‌లుక్‌లో 9 పాయింట్ల వరకు తిరిగి కోలుకోవడాన్నిచూపుతున్న హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ యొక్క ‘లైఫ్ ఫ్రీడమ్ ఇండెక్స్’ (ఎల్‌ఎఫ్‌ఐ)
నవతెలంగాణ – ముంబై: భారతదేశ  ప్రముఖ జీవిత బీమా సంస్థల్లో ఒకటైన హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ –  లైఫ్ ఫ్రీడమ్ ఇండెక్స్ (ఎల్‌ఎఫ్‌ఐ) తాజా ఎడిషన్‌ను విడుదల చేసింది. ఎల్‌ఎఫ్‌ఐ అనేది 2011లో హెచ్‌డి ఎఫ్‌సి లైఫ్ ద్వారా స్థాపించబడిన ఒక అధ్యయనం. ఈ సూచిక భారతీయ వినియోగదారుల మధ్య ‘ఆర్థిక స్వేచ్ఛ’ స్థాయిని కొలుస్తుంది మరియు అన్ని విభాగాలలో వినియోగదారుల యొక్క ఎప్పటికప్పుడు అభి వృద్ధి చెందుతున్న ఆర్థిక అవసరాలపై లోతైన దృక్పథాలను అందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది కీలకమైన వయోజన జీవిత-దశలను కవర్ చేస్తుంది. ఇది మూడు విభాగాలుగా చేయబడింది: యంగ్ ఆస్పి రెంట్స్, ప్రౌడ్ పేరెంట్స్ మరియు విజ్డమ్ ఇన్వెస్టర్స్.
ఎల్‌ఎఫ్‌ఐ నాలుగు ఉప సూచీలను కలిగి ఉంటుంది: ఈ ఎడిషన్ (2024) అధ్యయనం 15 నగరాల్లో (4 జోన్‌ల మంచి ప్రాతినిధ్యం మరియు 1, 2, 3 శ్రేణులు) 2076 మంది రెస్పాండెంట్స్ తో నీల్సెన్ ఐక్యూ ద్వారా నిర్వహించబడింది. లైఫ్ ఫ్రీడమ్ ఇండెక్స్ 70.8 వద్ద ఉందని తాజా 2024 అధ్యయనం వెల్లడించింది (2021తో పోలిస్తే 9 పాయింట్లు పెరిగింది). ఈవిధంగా సూచిక పైకి కదలడం కరోనా మహమ్మారి తర్వాత వినియోగదారు సెంటి మెంట్‌లో బౌన్స్-బ్యాక్‌ను, వినియోగదారుల ఆర్థిక దృక్పథంలో విశ్వాసం పరంగా మొత్తం మెరుగుదలని సూచిస్తుంది. ఎల్‌ఎఫ్‌ఐ యొక్క అన్ని ఉప-సూచీలు, ప్రత్యేకించి ఫైనాన్షియల్ ప్లానింగ్, ఆర్థిక సమృద్ధి మరియు సమర్ధత సూచికలలో వృద్ధికి ఈ ఊర్థ్వ గనమం కారణమని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ, ఆర్థిక అవగాహన, పరిచయ సూచికలో సాపేక్షంగా తక్కువ వృద్ధి అనేది ఆర్థిక ఉత్పత్తుల గురించి మెరుగైన పరిజ్ఞానం   అవసరాన్ని ప్రముఖంగా చాటిచెబుతుంది.
ఎల్‌ఎఫ్‌ఐ వెల్లడించిన మరో అంశం వినియోగదారులకు సంబంధించిన అగ్ర ప్రాధాన్యతల జాబితా. పిల్లల ఆర్థిక భద్రత, ఫిట్‌నెస్ (శారీరక మరియు మానసిక రెండూ), జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడం ఈ జాబితాలో  ఉన్నాయి. గమనించిన ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే, పదవీ విరమణ ప్రణాళిక క్రమంగా ఆర్థిక బాధ్యతగా ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. వయస్సుతో పాటు మరింత ముఖ్యమైనదిగా మారు తోంది. రిటైర్మెంట్ ప్లానింగ్ చేస్తున్నప్పుడు, ఆరోగ్యం, రోజువారీ జీవనం, పిల్లలకు అండగా నిలిచేందుకు చేసే ఖర్చులను వినియోగదారులు పరిగణనలోకి తీసుకుంటారు. వినియోగదారుల విభాగాల మధ్య ర్యాంకింగ్ పరంగా, ఎల్‌ఎఫ్‌ఐ ప్రకారం, విజ్డమ్ ఇన్వెస్టర్లు గరిష్ట వృద్ధిని ప్రదర్శిస్తూ అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో యంగ్ ఆస్పిరెంట్స్, ప్రౌడ్ పేరెంట్స్ ఉన్నారు. ఎల్‌ఎఫ్‌ఐ తాజా ఎడిషన్ ముఖ్యాంశాలలో ఒకటి టయర్ 3 వినియోగదారులు & పని చేసే మహిళలు ఎల్‌ ఎఫ్‌ఐలో గణనీయమైన పెరుగుదలను ప్రదర్శించారు. ఇది వారి ఆర్థిక ప్రణాళిక మరియు విశ్వాసంలో సాను కూల మార్పును ప్రతిబింబిస్తుంది. టైర్ 3 వినియోగదారుల మధ్య ఈ విధమైన అప్‌వర్డ్ ట్రెండ్ అనేది డిజిటల్ అధునాతనలు, ఎక్కువ కనెక్టివిటీ ద్వారా  పొందిన మెరుగైన ఆర్థిక యాక్సెస్ ద్వారా వచ్చిఉండవచ్చు. వర్కింగ్ విమెన్ కు సంబంధించిన ఇండెక్స్‌లో పెరుగుదలకు మహిళా సాధికారత కోసం డిజిటల్ అడ్వాన్స్‌ లు, చొరవల ద్వారా ఆర్థిక విద్యను సులభంగా యాక్సెస్ చేయడం కారణమని చెప్పవచ్చు.
గత ఎడిషన్ నుండి లైఫ్ ఇన్సూరెన్స్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్‌ను కూడా హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ పర్యవేక్షిస్తోంది. ఇది వినియోగదారుల ఆర్థిక ప్రణాళిక & లక్ష్య సాధనలో జీవితబీమా పాత్రను కొలుస్తుంది. ఈ సూచికలో 9.3 పాయింట్ల వృద్ధి ఉంది. ఇది వ్యక్తులకు సంబంధించి ఆర్థిక వ్యూహంలో కీలకమైన అంశంగా జీవిత బీమాకు  పెరుగుతున్న గుర్తింపును సూచిస్తుంది. ఆర్థిక అవసరాలు, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి జీవిత బీమా అందించే వినియోగదారుల విశ్వాసంపై ఈ పెరుగుదల కొనసాగింది. వెస్ట్ జోన్ అత్యధిక ఇండెక్స్ స్కోర్‌ను ప్రదర్శిస్తుండగా, ఈస్ట్ జోన్ అత్యధిక వృద్ధిని ప్రదర్శిస్తోంది. టైర్ 3 మార్కెట్లలో కూడా చెప్పుకోదగ్గ మెరుగుదల ఉంది. ఇది జీవిత బీమా ఒక ముఖ్యమైన ఆర్థిక ఉత్పత్తిగా ప్రాముఖ్యతను సంతరించుకోవడాన్ని సూచిస్తుంది. మొత్తంమీద, జీవిత బీమా ఆఫర్‌లు మెరుగైన పరిచయాన్ని కలిగి ఉన్నాయి. ఆర్థిక భద్రత, రాబడి, పిల్లల భవిష్యత్తు, జీవనశైలిని నిర్వహించడం వంటి అవసరాలు జీవిత బీమా కొనుగోలును నడిపించే కీలక ట్రిగ్గర్లుగా ఉన్నాయి.
Click here for the full report.
ఈ అధ్యయనాన్ని ఆవిష్కరించిన సందర్భంగా హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ – గ్రూప్ హెడ్ స్ట్రాటజీ & చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ విశాల్ సుబర్వాల్ మాట్లాడుతూ, ‘‘భారతీయ వినియోగదారులలో మొత్తం ఆర్థిక సంసిద్ధతకు సూచి కగా పనిచేయడానికి మేం లైఫ్ ఫ్రీడమ్ ఇండెక్స్ (ఎల్‌ఎఫ్‌ఐ)ని సృష్టించాం. మేం సంవత్సరాలుగా ఈ ఇండెక్స్ అభివృద్ధి చెందడం చూశాం. ప్రతి కొత్త అధ్యయనంతో, ఆర్థిక సంసిద్ధత, మెరుగుదల పరంగా వినియోగ దారుల విశ్వాసం స్థాయిలను మేం ఎక్కువగా కనుగొన్నాం. ఇది అభివృద్ధి,  ఆర్థిక భద్రతపై దృష్టి సారించి భవిష్యత్తు పట్ల సానుకూల విధానాన్ని సూచిస్తుంది. ఈ సంవత్సరం అధ్యయనం వర్కింగ్ విమెన్ మరియు టైర్ 3 మార్కెట్లలో ఆర్థిక స్వేచ్ఛ స్థాయిలు  మెరుగు పడడాన్ని ప్రముఖంగా చాటిచెప్పింది. లైఫ్ ఇన్సూరెన్స్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ గణనీయంగా వృద్ధి చెందింది. ఇది చక్కటి ఆర్థిక ప్రణాళికలో జీవిత బీమా ప్రాముఖ్యతను పునరుద్ఘాటిస్తుంది. ‘2047 నాటికి అందరికీ బీమా’ దిశగా మా ప్రయాణంలో హెచ్‌డిఎఫ్‌సి లైఫ్‌లో, జీవిత బీమా పరిశ్రమలో మా ప్రయత్నాలకు ఇది మరింత ఊపునిస్తుందని మేం నమ్ముతున్నాం’’ అని అన్నారు.