రూల్స్‌ ఉల్లంఘించాడు!

He broke the rules!– కిర్‌స్టన్‌పై పీసీబీ చీఫ్‌ నక్వీ వ్యాఖ్య
కరాచీ : దక్షిణాఫ్రికా క్రికెట్‌ దిగ్గజం గ్యారీ కిర్‌స్టన్‌ కాంట్రాక్టు ఒప్పందంలోని నిబంధనలను ఉల్లంఘించాడని, అగ్రిమెంట్‌ను అతడే రద్దు చేసుకున్నాడని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చైర్మన్‌ మోషిన్‌ నక్వీ అన్నారు. పాకిస్థాన్‌ జాతీయ జట్టు వైట్‌వాల్‌ ఫార్మాట్‌ కోచ్‌గా ఈ ఏడాది మేలో నియమితులైన గ్యారీ కిర్‌స్టన్‌.. సోమవారం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. జట్టు ఎంపికలో కోచ్‌ అధికారాలను పీసీబీ తొలగించటం విభేధాలకు దారితీసిందని సమాచారం. గ్యారీ కిర్‌స్టన్‌ శిక్షణ సారథ్యంలో భారత్‌ 2011 ప్రపంచకప్‌ సాధించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు సైతం కిర్‌స్టన్‌ చీఫ్‌ కోచ్‌గా వ్యవహరించారు.