ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి రెండవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య 

నవతెలంగాణ- కంఠేశ్వర్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పై నుంచి వృద్ధురాలు దూకి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున జామున జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం జంగాయిపల్లి గ్రామానికి చెందిన బేగరీ రత్నమ్మ (65) సోమవారం తెల్లవారుజామున ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి రెండవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. బేగరి రత్నమ్మ, ఆమె కూతురు పద్మలు జిల్లా జనరల్ ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు. పద్మ అనారోగ్య పరిస్థితికి తోడు ఆమెకు కల్లు సేవించే అలవాటు ఉండగా సెక్యూరిటీ సిబ్బంది కళ్ళు కప్పి తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా ప్యాకెట్లను లోనికి అనుమతించలేదని తెలిసింది. ఆదివారం రాత్రి తన కూతురుకు వైద్య సేవలు అందకపోవడం, కనీసం కల్లు ఇస్తామన్న సిబ్బంది అంగీకరించకపోవడంతో వృద్ధురాలు బేగరి రత్నమ్మ మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. ఈ మేరకు ఒకటవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.