మనస్థాపానికి గురై వాగులో దూకి ఆత్మహత్య..

నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండలం నీల గ్రామానికి చెందిన మేడి పోశెట్టి (49) మనస్థాపానికి గురై పెద్ద వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని రేంజర్ ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గత పది సంవత్సరాల కిందట యాక్సిడెంట్ లో ఎడమ కాలు కు విరిగిపోవడంతో, ఇప్పటినుంచి వ్యవసాయ పనులను చేసుకుంటూ తాగుడుకు బానిసై బాధపడుతూ ఉండేవాడని ఆయన పేర్కొన్నారు. భార్య మేడి సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు..