బీసీల పురోగతికి ఆఖరి శ్వాస వరకు పోరాటం చేశారు

He fought till his last breath for the progress of BCs– సన్మానోత్సవ కార్యక్రమంలో మున్నూరు కాపులు
నవతెలంగాణ – సిరిసిల్ల
శివ శంకర్ న్యాయవాద వృత్తిని చేపట్టిన నాటి నుంచి బీసీల పురోగతికి ఆఖరి శ్వాస  వరకు పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు లు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మున్నూరుకాపు కళ్యాణ మండపంలో మున్నూరు కాపుల సన్మానోత్సవ కార్యక్రమంలో  జస్టిస్ పుంజాల శివ శంకర్  95 వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా మున్నూరు కాపు ముఖ్య నేతలు మాట్లాడుతూ భారత సామాజిక న్యాయశిఖరం జస్టీస్ పుంజాల శివశంకర్ అని వారు పేర్కొన్నారు అనంతరం పలు తీర్మానాలు చేశారు. శివశంకర్ కు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించి గౌరవించాలి,స్మారక పోస్టల్ స్టాంప్ విడుదల చేయాలి, భారత పార్లమెంట్ లో అతని చిత్రపటం ఆవిష్కరించాలి. కేంద్ర ప్రభుత్వం , రాష్ట్ర ప్రభుత్వం అతని జయంతి , వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండ్ పై శివ శంకర్  విగ్రహం నెలకొల్పాలి. నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయo కు శివశంకర్ పేరు పెట్టాలి, కొత్తగా నిర్మించబోయే తెలంగాణ హైకోర్టు ప్రాంగణానికి  ఆయన పేరు పెట్టాలి. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు శివశంకర్ జీవితచరిత్ర ని పాఠశాల కళాశాల  పుస్తకాలలో పాఠ్యాంశంగా చేర్చాలని జిల్లా మున్నూరు కాపులు తీర్మానం చేశారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య, సంఘం నాయకులు నీలి శంకర్, తోట ఆగయ్య, గడ్డం నరసయ్య, కల్లూరి రాజు, అగ్గి రాములు, శీలం రాజు ,ఎర్రం మహేష్, బైరి ప్రభాకర్, కుల్ల సత్తయ్య, పోకల సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.