పాఠశాలను తీర్చిదిద్దడంలో ఆయనకు ఆయనే సాటి

పాఠశాలను తీర్చిదిద్దడంలో ఆయనకు ఆయనే సాటి – బదిలీపై వెళ్తున్న హెచ్‌ఎం మల్లేష్‌ కు ఘన సన్మానం
నవతెలంగాణ-శంషాబాద్‌
ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ఎంతో మంది ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచిన మం డల పరిధిలోని హుడా కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ.మల్లేశ్‌ సర్‌కు ఘన సన్మానించారు. ఆయన ఇటీవల జరిగిన ఉపాధ్యా యుల బదిలీలలో భాగంగా షాబాద్‌ మండల పరిధిలోని ఎల్లగొండగూడెం పాఠశాలకు వెళ్తున్నారు. మంగళవారం ఆర్డర్‌ పత్రాన్ని మండల ఎంఎన్‌ఓ జీఎం. ఎం.మధుకర్‌ పీఆర్టీ యూటీ ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి వెంకటరమణ చేతుల మీదుగా తీసుకున్నారు. కార్యక్రమంలో మండల సీనియర్‌ ఉపాధ్యాయులు దత్తం రెడ్డి, గణేష్‌, శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీనివాస్‌ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
హుడా కాలనీ మండల ప్రజా పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో సుమారు 9 ఏండ్ల పాటు ఆయన విధులు నిర్వహించారు. 80శాతం పిల్లలు వివిధ ప్రాంతాలకు చెందిన వలస నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆ పాఠశా లలో చదువుతుండేవారు. కనీస సౌకర్యాలు లేకుం డా ఉన్న పాఠశాలను చక్కగా తీర్చిదిద్ది రాష్ట్రంలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఘనత ఆయనకు దక్కుతుంది. ప్రహరీ గోడ నిర్మాణం మొదలు పాఠశాల గౌర అధ్యక్షులు వక్కంటి జనార్ధన్‌ సహకారంతో అనేక విజయాలు సాధించారు. దాతల సహకారం తీసుకొని పాఠశాలలో కావాల్సి న మౌలిక సదుపాయాలను కల్పించారు. పచ్చద నం, పరిశుభ్రత, హరితహారం, చక్కని విద్యాబో ధన, రికార్డుల నిర్వహణలో ఆయనకు రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది. జిల్లాలో ఉత్తమ పాఠశా లగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఆయ న అవార్డులు అందుకున్నారు. అన్ని విభాగాల్లో అగ్రగామి పాఠశాలగా నిలిచేటట్లు చేయడంలో ఆయన కృషి మరువలేనిది. చురుకైన ఉపాధ్యా యుడు పాఠశాలలో ఉంటే అద్భుత రీతిలో పాఠ శాల అభివృద్ధి చెందుతుందనేదానికి ప్రత్యక్ష ఉదా హరణగా నిలుస్తారు. ఎంతో ఇష్టంతో పాఠశాలను అభివృద్ధి చేసి మండలంలో ఆయన ఒక రోల్‌ మో డల్‌గా నిలిచారు. నిరంతరం విద్యార్థుల శ్రేయ స్సు కోసం పరితపించిన ఆయన బదిలీపై వెళ్లారు. మల్లేషా సర్‌ చేసిన అభివృద్ధిని అందించిన విద్యను ఆ స్థానంలో భర్తీ అయిన ఉపాధ్యాయులు ముం దుకు తీసుకుపోతే పాఠశాలకు ఇబ్బంది ఉండదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.