172 అడుగుల ఎత్తు నుంచి దూకేశాడు

అఖిల్‌, సురేందర్‌ రెడ్డి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘ఏజెంట్‌’. ఈనెల 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా మేకర్స్‌ సినిమా ప్రమోషన్‌ జోరుని పెంచారు. ఇందులో భాగంగా ఆదివారం విజయవాడలో వైల్డ్‌ పోస్టర్‌ని చాలా క్రేజీగా లాంచ్‌ చేసింది ఏజెంట్‌ టీమ్‌. అఖిల్‌ పోస్టర్‌ లాంచ్‌ సందర్భంగా నెవర్‌ బిఫోర్‌ ఫీట్‌ చేశారు. 172 అడుగుల ఎత్తు నుంచి రోప్‌ సహాయంతో ఏజెంట్‌ మోడ్‌లో అఖిల్‌ డైవ్‌ చేస్తూ కిందకు దిగిన రియల్‌ స్టంట్‌ అందరినీ సర్‌ప్రైజ్‌ చేసింది. వైల్డ్‌ పోస్టర్‌లో అఖిల్‌ లుక్‌ మెస్మరైజ్‌ చేసింది. వైల్డ్‌ పోస్టర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో అఖిల్‌ మాట్లాడుతూ, ‘ట్రైలర్‌ డేట్‌, టైం లాంచ్‌ ఇంత వైల్డ్‌గా చేశామంటే.. ట్రైలర్‌ ఎంత వైల్డ్‌గా ఉండబోతుందో ఊహించుకోండి. 18న ట్రైలర్‌ లాంచ్‌. అందరం కాకినాడలో కలుద్దాం’ అని చెప్పారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్‌ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈచిత్రం పలు భాషల్లో విడుదల కానుంది.