ఛాలెంజింగ్‌ పాత్ర చేశా

ఛాలెంజింగ్‌ పాత్ర చేశాపాపులర్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ దీపక్‌ సరోజ్‌ ‘సిద్ధార్థ్‌ రారు’తో హీరోగా అరం గేట్రం చేస్తున్నారు. వి యశస్వీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ రాధా దామోదర్‌ స్టూడియోస్‌, విహాన్‌ అండ్‌ విహిన్‌ క్రియేషన్స్‌ పతాకాలపై ప్రొడక్షన్‌ నెం 1గా జయ అడపాక, ప్రదీప్‌ పూడి, సుధాకర్‌ బోయినలు సంయుక్తంగా నిర్మించారు. ఈనెల 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.ఈ నేపథ్యంలో హీరో దీపక్‌ సరోజ్‌ మీడియాతో మాట్లాడుతూ, ‘ఇందులో పోషించిన సిద్ధార్థ్‌ రారు పాత్ర చాలా లాజికల్‌గా, ఎక్స్ట్రీమిజంలో ఉంటుంది. తను చాలా నాన్‌ రియాక్టివ్‌గా ఉంటాడు. మొదట్లో ఎంత కంట్రోల్‌గా ఉంటాడో తర్వాత అంత అన్‌ కంట్రోల్‌ అయిపోతాడు. ఇది ప్లెయిన్‌ క్యారెక్టర్‌ కాదు. ఈ సినిమాకి ‘సిద్ధార్థ్‌ రారు’ పేరుపెట్టడానికి బలమైన కారణం వుంది. ఇందులో సిద్ధార్థ్‌ అనేది రివర్స్‌ థీసెస్‌ అఫ్‌ గౌతమ బుద్ధ. దర్శకుడు యశస్వీ చాలా అద్భుతంగా స్క్రిప్ట్‌ చేశారు. నాపాత్రను అందరూ అంగీకరిస్తారు’ అని తెలిపారు.