విరాట్ కర్ణ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇందులో కీలక పాత్ర పోషించిన అనసూయ భరధ్వాజ్ మీడియాతో మాట్లాడుతూ, ”కథాపరంగా ప్రేక్షకులు పెదకాపు వరల్డ్‌తో ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. సినిమా చూసిన తర్వాత నా పాత్ర ఇంకా ఇంపాక్ట్ ఫుల్‌గా ఉంటుంది. ఇందులో నా పేరు నాకు చాలా కొత్తగా అనిపించింది. చాలా నచ్చింది. సినిమా విడుదల తర్వాత అందరూ ఆ పేరుతోనే పిలుస్తారనే నమ్మకం ఉంది. ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా, ‘విమానం’లో సుమతి పాత్రలో విభిన్నంగా కనిపించాను. ఇప్పుడు ఇందులో చేసిన పాత్ర కూడా చాలా బలంగా, వైవిధ్యంగా ఉంటుంది. ఇది చాలా రా ఫిల్మ్. నా పాత్రలో కొన్ని బోల్డ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పెదకాపు లాంటి కథ చెప్పినపుడు షాక్ అయ్యా. దర్శకుడిగా ఆయనకి ఇది చాలా డిఫరెంట్ ట్రాన్స్‌ఫర్మేషన్. దీంతోపాటు ఆయన నటించడం బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాలోని పాత్ర కోసం సినిమాటోగ్రాఫర్ ఛోటా కె.నాయుడు దర్శకుడు శ్రీకాంత్‌కి నన్ను రిఫర్ చేయటం ఆనందంగా ఉంది’ అని చెప్పారు.