పొట్టేల్‌లో పవర్‌ఫుల్‌ రోల్‌ చేశా..

He played a powerful role in Potel..యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్‌ రోల్స్‌లో సాహిత్‌ మోత్కూరి డైరెక్ట్‌ చేసిన రూరల్‌ యాక్షన్‌ డ్రామా ‘పొట్టేల్‌’. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్‌ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్‌ కుమార్‌ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ అనన్య నాగళ్ల మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు. ‘డైరెక్టర్‌ సాహిత్‌ చెప్పిన కథ బావుంది. ఇందులో చదువు అనే పాయింట్‌ చాలా నచ్చింది. ఇంత మంచి కాన్సెప్ట్‌, కథలో ఎలా అయిన పార్ట్‌ కావాలని చేశాను. సినిమాలో నా పాత్ర చూసి సర్‌ప్రైజ్‌ అవుతారు. నా క్యారెక్టర్‌ పేరు బుజ్జమ్మ. ఇప్పటివరకూ మల్లేశం అనన్య, వకీల్‌ సాబ్‌ అనన్య అనే పిలుస్తుంటారు. ఈ సినిమా తర్వాత బుజ్జమ్మ అనన్య అని పిలుస్తారు. అంత ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేస్తుంది. నాది చాలా స్ట్రాంగ్‌ రోల్‌. ‘శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌’ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. సతీష్‌ వేగేశ్న ‘కథాకళి’, అలాగే ‘లేచింది మహిళా లోకం’ అనే మరో సినిమా చేస్తున్నాను’.