యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్‌లో సాహిత్ మోత్కూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పొట్టేల్’. ఈ చిత్రంలో అజయ్ పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నటుడు అజయ్ మీడియాకి పలు విశేషాలను షేర్ చేశారు.
– దర్శకుడు సాహిత్ కథ చెప్పినప్పుడు చాలా క్యాజువల్‌గా విన్నాను. రెండు గంటల నేరేషన్ తర్వాత ఈ సినిమాలో క్యారెక్టర్ డెఫినెట్‌గా చేయాలనిపించింది. అంతేకాదు నా క్యారెక్టర్‌ని చాలా బాగా చేయాలి, లేకపోతే సినిమా పాడైపోతుందనే ఫీలింగ్‌ని డైరెక్టర్ కలిగించగలిగారు. కథని ఎంత అద్భుతంగా చెప్పాడో సినిమాని కూడా అంత అద్భుతంగా తెరకెక్కించాడు.
– మూఢ నమ్మకాలు, మూఢ నమ్మకల్ని అడ్డం పెట్టుకుని బతికే మనుషుల గురించి, మొండితనం గురించి, గ్రామదేవతల గురించి.. ఇలా మల్టీ లేయర్స్‌లో
ఈ సినిమా ఉంటుంది. ముఖ్యంగా పాప చదువు కోసం ఫైట్ చేసే బ్యాక్ డ్రాప్ ఉంది. ఇలాంటి కథలు చెప్పినప్పుడు కొన్నిసార్లు సందేశం ఎక్కువైపోయే అవకాశం ఉంది. దీన్ని కమర్షియల్‌గా తీసుకురావడం చాలా కష్టం. డైరెక్టర్ సాహిత్ ఈ కథని మంచి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా తీర్చిదిద్దాడు. ఇందులో విజిల్స్ పడే సీన్స్ ఉంటాయి.
– విక్రమార్కుడు తర్వాత అంతా టెర్రిఫిక్ విలన్ వేషాలు తక్కువే వచ్చి ఉంటాయి. అవి కూడా చాలా వరకు రాజమౌళి సినిమాలోనే ఉన్నాయి. టిట్ల లాంటి క్యారెక్టర్స్ రెగ్యులర్‌గా రావు. అదొక మ్యాజిక్ లాగా జరిగిపోయింది. ఈ సినిమాలో చేసిన పటేల్ క్యారెక్టర్‌లో చాలా షేడ్స్ ఉన్నాయి. అందుకే చాలా రోజుల తర్వాత నాకు నచ్చిన రోల్ దొరికిందని చెప్పాను.
– దర్శకుడు కొరటాల శివకి సినిమా చూపించాను. ఆయనకి చాలా నచ్చింది. అలాగే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చూశారు. ఆయనకీ నచ్చింది. కమర్షియల్ సక్సెస్ తో పాటు అవార్డ్స్ కూడా ఈ సినిమాకు వస్తాయని డైరెక్టర్‌తో ఆయన చెప్పారు.