– రూ.1,437 కోట్ల నికర లాభాలు
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని ఏరోక్రాప్ట్స్ తయారీ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఎఎల్) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 77 శాతం వృద్ధితో రూ.1,437 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.814 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.3,915 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. గడిచిన క్యూ1లో 11 శాతం పెరిగి రూ.4,348 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 18 శాతం ఎగిసి రూ.5,083 కోట్లుగా నమోదయ్యింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.4,325 కోట్ల ఆదాయం ప్రకటించింది.