కష్టపడిన ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకుంటా…

– డీసీసీబీ చైర్మన్ ను సన్మానించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..
నవతెలంగాణ – మునుగోడు
తమపై నమ్మకంతో అహర్నిశలు కష్టపడిన ప్రతి ఒక్కరిని కంటికి రెప్పల కాపాడుకునే బాధ్యత నాది అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. డీసీసీబీ చైర్మన్ గా ఎన్నికై కుంభం శ్రీనివాస్ రెడ్డి బుధవారం హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లగా శ్రీనివాస్ రెడ్డిని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  సహకార సంఘం, సహకార బ్యాంక్ ద్వారా రైతులకు అవసరమైన అన్ని సేవలు అందించాలని అందుకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని హామీ ఇచ్చారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఉన్నత పదవులు పొందేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం  డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ చైర్మన్ గా ఎన్నుకునేందుకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన రాజగోపాల్ రెడ్డి  కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.