– దేవరాంపల్లిలో వ్యక్తి దారుణ హత్య
నవతెలంగాణ-మల్హర్‌రావు/కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని దేవరాంపల్లిలో దారుణ హత్య జరిగింది. ఓ వ్యక్తి కొడుకుతో కలిసి బైక్‌పై వెళ్తుండగా దారికాసిన దుండగులు కండ్లల్లో కారం చల్లి.. గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటన శనివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. దేవరాంపల్లి గ్రామానికి చెందిన మారుపాక సారయ్య(50) కొడుకుతో కలిసి బైక్‌పై వెళ్తుండగా దుండగులు అడ్డగించారు. సారయ్య కండ్లల్లో కారం పొడి చల్లి గొడ్డలితో నరికి చంపారు. కాగా, సారయ్య కొడుకు పారిపోయి వారి నుంచి తప్పించుకున్నాడు. విషయం తెలుసుకున్న కాటారం సీఐ నాగార్జునరావు, కొయ్యూర్ ఎస్‌ఐ వడ్లకొండ నరేష్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. భూ తాగాదాలతోనే హత్య జరిగినట్టుగా ప్రచారం జరుగుతుండగా.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తులో ఉంది.