
నవతెలంగాణ-మిరు దొడ్డి : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేస్తానని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. అక్బర్ పేట భూoపల్లి మండలం మోతే గ్రామంలో నూతనంగా నిర్మించిన మూడు కమ్యూనిటీ భవనాలను స్థానిక సర్పంచు శ్రీనివాస్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా కృషి చేయాలన్నారు. ఎన్నికల సమయంలోనే పార్టీల కోసం నాయకులు, కార్యకర్తలు పాటుపడాలని ఎన్నికలు ముగిసాక గ్రామాల అభివృద్ధి కోసం ముందుకు సాగాలన్నారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలు నెలకొంటే తన దృష్టికి తీసుకువస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో నెలకొన్న సమస్యలను మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య, ఎంపీపీ సాయిలు, లక్ష్మీ లింగం, జడ్పిటిసి రవీందర్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు బి ఆర్ ఎస్ నాయకులు నర్సింలు రాజేశ్వర్ బూపాల్ కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.