– ఎంపీ క్వార్టర్స్‌లో అఘాయిత్యం
– ప్రజ్వల్ రేవణ్ణపై పార్టీ కార్యకర్త ఫిర్యాదు
బెంగళూరు : తనను, తన భర్తను చంపేస్తానని బెదిరించి హస్సన్ నగరంలోని ఎంపీ క్వార్టర్స్‌లో జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తనపై అఘాయిత్యా నికి పాల్పడినట్టు ఆ పార్టీకి చెందిన 44 ఏండ్ల మహిళా కార్యకర్త ఫిర్యాదు చేశారు. దీనిపై ఈ నెల 1న బెంగళూరులో కేసు నమోదయింది. 2021లో ఈ దారుణం జరిగిందని, ఈ ఘటనను ప్రజ్వల్ రేవణ్ణ తన ఫోన్‌లో రికార్డు చేసుకున్నాడని తెలిపింది. ఈ ఫుటేజ్‌తో బెదిరిస్తూ జనవరి 1, 2021 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 25 వరకూ అనేకసార్లు లైంగికదాడికికి పాల్పడ్డా డని బాధిత మహిళ తెలిపింది. తనకు, తన భర్త ప్రాణాలకు ముప్పు ఉందనే భయంతో ఇన్ని రోజులు ఈ విషయంపై ఫిర్యాదు చేయలేదని, తన కంప్లెయింట్‌లో మహిళ పేర్కొంది. ఈ ఫిర్యాదుతో ఐపీసీలోని సెక్షన్లు 376 (2) (ఎన్), సెక్షన్ 354 (బి), (సి)తో పాటు ఐటీ చట్టం 2000లోని వివిధ సెక్షన్ల ప్రకారం కూడా ప్రజ్వల రేవణ్ణపై కేసు నమోదయింది. ఒక హస్టల్లో కొంత మంది మహిళా విద్యార్థినులకు సీట్లు కోరుతూ 2021లో ఎంపీని కలవడానికి వెళ్లినప్పుడు తరువాత రోజు రమ్మని చెప్పారని, తరువాత రోజు ఎంపీ క్వార్టర్స్‌లో తుపాకీతో బెదిరించి బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ తెలిపింది.
హెచ్.డి. రేవణ్ణపై కిడ్నాప్ కేసు ..
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి, జేడీ(ఎస్) ఎమ్మెల్యే హెచ్.డి. రేవణ్ణపై కేసు నమోదైంది. ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపులకు పాల్పడిన బాధితు రాలిలో ఒకరిని కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలతో హెచ్‌డి రేవణ్ణపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు. బాధితురాలు గతంలో హెచ్‌డి రేవణ్ణ ఇంట్లో పనిమనిషిగా ఆరేండ్ల పాటు పనిచేసిందని, ప్రజ్వల్‌రేవణ్ణ ఆమెపై దారుణానికి పాల్పడినట్లు ఇటీవల విడుదలైన వీడియోల్లో ఉందని పోలీసులు తెలిపారు. కిడ్నాపైన మహిళ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తు న్నారు. తనపై అరాచకానికి పాల్పడిన ప్రజ్వల్ రేవణ్ణకు వ్యతిరేకం గా సాక్ష్యం చెప్పకుండా నిరోధించేం దుకే ఆమెను కిడ్నాప్ చేశారని పోలీసులు తెలిపారు.
బాధితురాలి కుమారుడు గురు వారం సాయంత్రం మైసూరు జిల్లా లోని కె.ఆర్. నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలి పారు. ఏప్రిల్ 29న కె.ఆర్. నివాసి అయిన సతీష్ బాబన్న ఆమెను బలవంతంగా హెచ్.డి. రేవణ్ణ నివా సానికి తీసుకెళ్లా రని, అప్పటి నుంచి కనిపించడం లేదని ఫిర్యాదులో తెలిపారు. పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వవద్దని ఏప్రిల్ 26న కూడా తమ ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులను బెదిరించారని తెలి పారు. గతంలో ఆరేండ్ల పాటు తన తల్లి హెచ్.డి. రేవణ్ణ ఇంట్లో పని చేశారని, మూడేండ్ల క్రితం గ్రామానికి తిరిగి వచ్చారని అన్నారు. హెచ్.డి. రేవణ్ణ ఆదేశాల మేరకు సతీష్ బాబన్న తన తల్లిని కిడ్నాప్ చేశారని, ఆమె ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొ న్నారు. తన తల్లిని రక్షించాలని, వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతు న్నాను అని ఫిర్యాదుదారు తెలిపారు.
బెయిల్ పిటీషన్ వెనక్కి తీసుకున్న రేవణ్ణ
లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ తన ముందస్తు బెయిల్ దరఖాస్తును వెనక్కి తీసుకున్నారు. బెంగుళూరు సెషన్స్ కోర్టులో ఆయన ఆ పిటీషన్ వేశారు. ఈ కేసులో హెచ్‌డీ రేవణ్ణపై నాన్ బెయిలబుల్ అభియోగాలు ఏమీ లేవని ప్రత్యేక దర్యాప్తు బృందం పేర్కొన్నది. దీంతో హెచ్‌డీ రేవణ్ణ తన బెయిల్ పిటీషన్‌ను వెనక్కి తీసుకు న్నారు. హసన్ జిల్లాలోని హోలెనర్సి పురా నియోజకవర్గం నుంచి రేవణ్ణ జేడీఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. హెచ్‌డీ రేవణ్ణ ఇంట్లో పనిచేస్తున్న ఒక మహిళ ప్రజ్వల్‌తో పాటు హెచ్‌డీ రేవణ్ణపై కూడా లైంగిక వేధింపుల కేసును నమోదు చేసిన సంగతి తెలిసిందే.