– మద్దూరు ఎంపీపీ బద్దిపడగ కష్ణారెడ్డి
నవతెలంగాణ-మద్దూరు
మద్దూరు, దూల్మిట్ట మండలాల అభివద్ధికి తాను కషి చేస్తుంటే కొంతమంది తనపై సామాజిక మాధ్యమాలలో తప్పుడు పోస్టులు పెడుతూ తన పరువు తీస్తున్నారని. తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని మద్దూరు ఎంపీపీ బద్దిపడగ కష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తోర్నాల గ్రామానికి చెందిన వగలబోయిన శ్రీధర్ అనే వ్యక్తికి సంబంధించిన కుటుంబ భూసమస్య తనపై రుద్దుతూ సామాజిక మాధ్యమాలలో తనపై అవినీతి ఆరోపణలు చేస్తూ పోస్టులు పెడుతున్నాడని. అతనికి చిత్తశుద్ధి ఉంటే తన అవినీతిని నిరూపించినట్లయితే వెంటనే తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన తెలిపారు. తన సొంత పార్టీ నాయకులు తనపై కొద్ది రోజుల క్రితం అసత్య ఆరోపణలు చేస్తున్నారని అలాంటి ఆరోపణలు మానుకోవాలని ఆయన కోరారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పని చేయాలి తప్ప ఒక వ్యక్తి కోసం కాదన్నారు. మండల పరిషత్ అభివద్ధి కోసం ఎంతో కషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దూల్మిట్ట మండల ప్రజలు తన సొంత ఊరు కాకున్న తనపై నమ్మకంతో ఎంపీటీసీగా గెలిపించి ఎంపీపీ చేశారని దానికి కతజ్ఞతగా మండల ఏర్పాటులో తన పాత్ర ఎంతో ఉందని గుర్తు చేశారు. ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదని ఆయన తెలిపారు. ఎవరికీ ఎలాంటి సందేహాలు ఉన్న నిర్భయంగా సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు తీసుకొని ఆరోపణలు చేయాలని ఆయన తెలిపారు. వ్యక్తిగత దూషణ చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తన పరువుకు భంగం కలిగించినట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టిన వగలబోయిన శ్రీధర్‌పై ఎంపీపీ బద్దిపడగ కష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ నాగిళ్ల తిరుపతిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఆకుల యాదగిరి, ఎంపీటీసీలు గుజ్జుక సమ్మయ్య, నందన బోయిన నరసింహులు, గుల్ల సత్య కళ, బొప్ప కనకమ్మ,సర్పంచులు జనార్దన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, అంజయ్య,తాళ్లపల్లి రాజమ్మ, జాటోత్ రేణుక కాల్ రాం, రేఖ శ్రీనివాస్, ఉన్నారు.