
అండగా ఉంటా.. అన్నివిధాలుగా ఆదుకుంటా అని బుసిరెడ్డి పౌండషన్, శ్రీ వైష్ణవి కన్స్ట్రక్షన్స్ ఛైర్మెన్ పాండురంగారెడ్డి పేదలకు భరోసా ఇచ్చారు. శనివారం నల్గొండ జిల్లా గార్జునసాగర్ నియోజకవర్గం, నిడమానూరు మండలం, వెంగన్న గూడెం గ్రామానికి చెందిన పోతుగంటి ముత్తయ్య (50) సంవత్సరాలు స్వర్గస్తులు అయ్యినారనితెలుసుకొని ఆ కుటుంబానికి అండగా బుసిరెడ్డి ఫౌండేషన్ఛైర్మెన్ పాండు రాంగారెడ్డి అంత్యక్రియలు అనంతరం భోజనాలు పంపించడం జరిగింది. ఆర్ధికంగా ఇబ్బందివున్న నిరుపేద కుటుంబాలకి మన బుసిరెడ్డి ఫౌండేషన్ ఎల్లపుడూ అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉంటుందని బుసిరెడ్డి పాండురంగారెడ్డి పిలుపునిచ్చారు. ఈసందర్బంగా మాట్లాడుతూ.. సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 9581742356కు సంప్రదించవలసినదిగా కోరడమైనదని తెలిపారు. భగవంతుడు ఇచ్చిన సంపదలో మనిషి బ్రతికివున్నన్ని రోజులు నలుగురిని ఆదరిద్దాం అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.