తుపాకీతో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

నవతెలంగాణ – హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ ‌పోలీస్ స్టేషన్ ఆవరణలో హెడ్ కానిస్టేబుల్ సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన్ను భైరామ్‌గఢ్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఈ ఘటన జరిగింది. హెడ్ ​కానిస్టేబుల్ సోనూ హప్కా భైరామ్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్నారు. బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ ఈ విషయాన్ని ధృవీకరించారు.