నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండలం కేశవపట్నం పోలీస్ స్టేషన్ లో గత కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ కూనమల్ల పరంధాములు(54) గుండెపోటుతో మృతి చెందిన సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి కేశవపట్నం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ పరంధాములు శుక్రవారం కోర్టు కు కేసుల డ్యూటీ నిమిత్తం హుజురాబాద్ వెళ్లి విధులు ముగించుకొని కేశవపట్నం బస్టాండ్లో బస్సు దిగి ఆటోలో హాస్పిటల్ కి వెళ్లేలోపే గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న హుజురాబాద్ రూరల్ సిఐ బి సంతోష్ కుమార్, హుటా హుటిన కేశవపట్నం చేరుకొని హెడ్ కానిస్టేబుల్ మృతి పట్ల, స్థానిక ఎస్సై, దేశ్ చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది, తీవ్ర దిగ్భంది వ్యక్తం చేశారు.