నవతెలంగాణ – సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు పై వచ్చిన అవినీతి ఆరోపణలపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ దర్యాప్తు చేసి నివేదిక ఐ.జి కి పంపగా.. ఆ నివేధిక ఆధారంగా హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు పై వచ్చిన అవినీతి ఆరోపణలు నిజం కావడం తో సోమవారం మల్టీ జోన్ -1 ఇంచార్జ్ ఐ.జి సుధీర్ బాబు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.