మండలంలోని మైలారం గ్రామానికి చెందిన మామిడాల ప్రశాంత్ బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా విషయం తెలుసుకున్న ఎస్ఆర్ఆర్ సంస్థల అధినేత పరిపాటి శ్రీనివాస్ రెడ్డి గురువారం ఆసుపత్రికి వెళ్లి బాధితుని పరామర్శించి 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్టీసీ కండక్టర్ గా పనిచేస్తున్న ప్రశాంత్ అరుదైన వ్యాధితో బాధపడడం బాధాకరం అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉండి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. డాక్టర్లను ప్రశాంత ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు లెతాకుల మహేందర్ రెడ్డి, రవీందర్ చారి, తదితరులు ఉన్నారు.