నవతెలంగాణ- చండూరు: రాష్టంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంకి వ్యతిరేక పవనాలు విస్తున్నాయని టీడీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ అన్నారు. శనివారం ఆ పార్టీ కార్యాలయం లో విలేకరుల తో మాట్లాడుతూ 10 ఏండ్ల కెసిఆర్ పాలన పై ప్రజలు అసంతృప్తిలో ఉన్నారని తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, అస్తవ్యస్థ పాలన, కాళేశ్వరం ప్రాజెక్టు, అవినీతి వేల కోట్ల దోపిడీ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ల అరాచకాలు తో పాటు చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై కేటీఆర్ వ్యాఖ్యలు పార్టీ తీవ్ర ప్రభావం చూపి ఓడిపోయే పరిస్థితి వచ్చింది అన్నారు. చంద్రబాబు అరెస్ట్ తో పాటు కొన్ని ప్రత్యేక పరిస్థితి లో రాష్టంలో టీడీపి ఎన్నికల కు దూరం గా ఉందని చెప్పారు. స్థానిక రాజకీయ పరిస్థితి ల దృష్ట కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కి మద్దతు ఇవ్వాలని మునుగోడు నియోజకవర్గం టీడీపీ నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ సమావేశం లో టీడీపి పార్లమెంట్ అధికార ప్రతినిథి ఎండీ షరీఫ్, మండల పార్టీ అధ్యక్షులు ఎర్రజెల్ల లింగయ్య, పట్టణ అధ్యక్ష కార్యదర్శి లు గంట అంజయ్య, తోకల యాదయ్య, బోడ బిక్షం, మారగోని పాపయ్య. తదితరులు ఉన్నారు.