ఇంద్రవెల్లి : మండలంలోని పిట్టబొంగరం పిహెచ్‌సి వైద్య సిబ్బంది వాగు దాటి వైద్యం అందించారు. హర్కాపూర్ పంచాయతీ పరిధిలోని మారుమూల గ్రామమైన మామిడిగూడకు వెళ్లాలంటే వాగు దాటాల్సిందే. బుధవారం వైద్యురాలు పూజిత, ఏఎన్‌ఎం విజయ, సుందరి ఆధ్వర్యంలో వాగును దాటి ఇంటింటా ర్యాఫిడ్ ఫీవర్ సర్వే నిర్వహించారు. గ్రామం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 49 మంది ఓపిలను పరీక్షించారు. 8 మంది గర్భవతులు, బాలింతలకు అవసరమైన మందులను అందజేశారు. చిన్న పిల్లలకు వాక్సినేషన్ చేశారు. అనంతరం గ్రామంలో డ్రై డేను నిర్వహించారు. జ్వరాలు రాకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటిని నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో ఆశా మైనాబాయి పాల్గొన్నారు.