లక్కారంలో హెల్త్ క్యాంప్

Health Camp in Lakkarనవతెలంగా – ముత్తారం
ముత్తారం మండలం లక్కారం గ్రామంలో జ్వరాలు వస్తున్నాయని, మండల వైద్యాధికారి డాక్టర్ అమ ందర్ రావు తన వైద్య సిబ్బందితో కలిసి శనివారం హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా 72 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, 22 మందికి మలేరియా ర్యాపిడ్ టెస్ట్ చేశారు. 15 మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. అదేవిధంగా 23 మందికి బ్లడ్ షుగర్, బిపి టెస్ట్లు నిర్వహిం చారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలను తీసుకోవడం జరుగుతుందని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంత రం మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ నర్స్ గ్రేస్మని, హెల్త్ అసిస్టెంట్ ఎ ౦. శ్రీనివాస్,  బొల్లం దీప్తి, బియ్యాని లావణ్య, ల్యాబ్ టెక్నిషియన్ అనిల్, పుష్పలత, ఆశాలు కల్పన, రజిత, శేషిక తదితరులున్నారు.