నవతెలంగాణ-రాజంపేట్ ( భిక్కనూర్ )
భిక్కనూర్ మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఉన్న మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే బాలికల వసతి గృహంలో రాజంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని మెడికల్ అధికారి విజయ మహాలక్ష్మి సోమవారం ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులకు మందులు అందజేసి, విద్యార్థులు భోజన సమయంలో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది, విద్యార్థులు, తదితరులు ఉన్నారు.