
మండల పరిధిలోని జెట్టి వారి గూడెం పెద్దవాగు ప్రాజెక్ట్ భవన సముదాయం సమీపంలో గల గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ డిగ్రీ మహిళా కళాశాలలో మంగళవారం గుమ్మడవల్లి ప్రాధమిక ఆరోగ్యం కేంద్రం ఆద్వర్యంలో డాక్టర్ మధుళిక పర్యవేక్షణలో ఆరోగ్య శిభిరం నిర్వహించారు. 65 మందిని పరీక్షించి 5 గురు విద్యార్ధిని లకు జ్వరం ఉండటంతో మలేరియా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. సాధారణ జ్వరం అని తేలడంతో ప్రధమ చికిత్స చేసారు. చిన్న చిన్న రోగాలకు చికిత్స అందించారు. కాలానుగుణంగా వచ్చే వ్యాధుల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుధ్యం గురించి ఆరోగ్య విద్యను అందించారు. టి.హబ్ కోసం రక్త నమూనాలను సేకరించారు. నారాయణపురం కాలనీలో ఆరోగ్య శిబిరం నిర్వహించి 45 మందిని పరీక్షించారు. జ్వరంతో బాధపడుతున్న 9 మందిని గుర్తించి మలేరియా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మలేరియా లేక పోవడంతో తరుణ వ్యాధులకు మందులు ఇచ్చారు.రామన్నగూడెం లో ఆరోగ్య శిబిరం మొత్తం 33 మందిని పరీక్షించి, అయిదుగురు జ్వరంతో ఉండటంతో మలేరియా నిర్ధారణ పరీక్షలు చేసారు. చిన్నపాటి జబ్బులకు చికిత్స చేసి డ్రై డే కార్యకలాపాలు నిర్వహించారు. హెచ్.వి దుర్గమ్మ, ఎ.ఎన్.ఎం లు, ఆశాలు పాల్గొన్నారు.