రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్

మండలంలోని పోచారం గ్రామ పాఠశాల ఆవరణలో మంగళవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మొబైల్ మెడికేర్ యూనిట్ సమన్వయంతో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కంటి పరీక్షలు, దంత పరీక్షలు సంబంధించిన ఈసీజీ, వివిధ విభాగాల డాక్టర్లు పరీక్షలు జరిపి అవసరమైన మందులు ఉచితంగా అందించారు. జిల్లా ఏంసీ మెంబర్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇంత పెద్ద శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు సంతోషం వ్యక్తం చేసి, నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐఆర్సిఎస్ రాష్ట్ర ఈసి మెంబర్ సంజీవ్ రెడ్డి, జిల్లా ఆరోగ్య సమన్వయ డా.విక్రం కుమార్, జిల్లా కోశాధికారి దస్తిరాం, డివిసొన్ చైర్మన్ వేణు, మండల శాఖ చైర్మన్ నందు, తాహాసిల్దార్ దశరథ్, డా.రోహిత్, డా.శెషి,డా.గంగా సింగ్, కంటి నిపుణులు,ల్యాబ్ టెక్నీషియన్ లు పాల్గొన్నారు.