నవతెలంగాణ – సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో పట్టణ ఆరోగ్య కేంద్రం శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యాధికారి డాక్టర్ కృష్ణవేణి తో పాటు సిబ్బందితో కేంద్ర వైద్య ఆరోగ్య పథకాలపై సమీక్షించారు. లక్ష్యాలను సాధించాలని వారికి దిశా నిర్దేశం చేశారు. విధి నిర్వహణలో తప్పనిసరి సమయపాలన పాటించాలని ఆమె పేర్కొన్నారు. వైద్య సిబ్బంది రోగులతో స్నేహపూర్వకంగా ఉంటే వారికి సగం రోగం నయమవుతుందని ఆమె పేర్కొన్నారు.