నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్ : నల్లగొండ పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, ఏరియా హాస్పిటల్స్ ను బలోపేతం చేయాలని,ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ, సహాయ కార్యదర్శి భూతం అరుణకుమారి డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండ పట్టణంలోని పానగల్, మాన్యం చిలక, లైన్ వాడ , హాస్పిటల్స్ ను ఐద్వా ఆధ్వర్యంలోసర్వే చేయడం జరిగింది. సర్వే ఉద్దేశించి వారు మాట్లాడారు. పానగల్ అర్బన్ హాస్పిటల్ లో వర్షం వచ్చినప్పుడు వర్షం నీరు పాములు, తేలు రావడం జరుగుతుంది. మూడు రోజుల వరకు కూడా బురద ఉండడం వల్ల పేషెంట్లు రావడం లేరు. మాన్యం చెల్క హాస్పిటల్ కి సొంత భవనం లేదు. ఆసుపత్రికి సొంత భవనం నిర్మించాలని, పేరుకుపోయిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.150 మంది వరకు నిత్యం ఓపీ పేషెంట్లు వస్తుంటారు. మంగళవారం రోజు ఆరోగ్య మహిళకార్యక్రమం నిర్వహిస్తున్నారు. చీకటిగా వెలుతురు లేకుండా గాలి లేకుండా మహిళలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. ఒకరే డాక్టరు ఉండడం వలన అందరికీ చూడకుండా ఫార్మసిస్టు మందులను ఇచ్చి పంపిస్తున్నారని పేర్కొన్నారు. 20వేల రూపాయలు బిల్లు బకాయి వెంటనే విడుదల చేయాలని, లైన్ వాడ హాస్పిటల్ లో మందుల కొరత ఉంది. గ్యాస్టిక్ సంబంధించిన మందులు రెండు నెలల నుంచి లేవు. మూడు హాస్పిటల్స్ లో కూడా సిబ్బందికి వేతనాలు మూడు నెలల వరకు కూడా రావడంలేదని ఇబ్బంది పడుతున్నారు. సిబ్బందికి ప్రతి నెల కూడా వేతనాలు అందించాలని, మందులు అందుబాటులో ఉంచాలని, మన్యం చెల్కా హాస్పిటల్ కు త్వరగా సొంత భవనం నిర్మించాలని,అదనంగా ఇంకో డాక్టర్ను కేటాయించాలని అన్ని మందులను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో నాగలక్ష్మి, శృతి, శ్రావ్య తదితరులు పాల్గొన్నారు.