తెలంగాణ భవన,ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ మండలి చే గుర్తింపు పొందిన కార్మికుల కుటుంబాలకు సీఎస్ సీ(కామన్ హెల్త్ సెంటర్),వెల్ నెస్ సర్వీసెస్ లిమిటెడ్ ఆద్వర్యంలో ఆదివారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట స్థానిక జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాలలో ఉచిత ఆరోగ్య నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 150 మంది కార్మిక కుటుంబాలు సభ్యులకు 56 రకాల నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు సీఎస్ సీ హెల్త్ కేర్ జిల్లా కో – ఆర్డినేటర్ షేక్ అక్బర్ అలీ తెలిపారు.కార్మిక సంక్షేమ మండలి చే గుర్తింపు పొంది,కార్డు ఉన్నవారికి ఉచితంగా పరీక్షలను నిర్వహించడం ద్వారా కార్మికులు యొక్క అనారోగ్యాన్ని ముందస్తు గా నిర్ధారించి వారికి సకాలం లో సరైన వైద్యం అందించడమే ఈ శిబిరాలు ముఖ్య ఉద్దేశ్యం అని ఆయన తెలిపారు.తద్వారా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తూ అనేక వ్యాదుల బారిన పడుతున్న వారికి ఈ పరీక్షలు ఎంతో ప్రయోజనం అని హర్షం వ్యక్తం చేసారు. ఈ శిబిరంలో దీర్ఘకాలిక తీవ్రమైన ఇబ్బందుల తో బాధపడుతున్న 17 మంది కార్మికులను గుర్తించి మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాల్సిందిగా సూచించడం జరిగిందని తెలిపారు.ఈ ఉచిత ఆరోగ్య నిర్ధారణ పరీక్ష శిబిరంలో క్యాంప్ కోఆర్డినేటర్ జి.మహేష్ పాటు సిబ్బంది సాగర్,ప్రసన్న,అంజలీ,పావని, దుర్గ,బాబి,రాణి,లావణ్య, నాగరాజు తదితరులు ఉన్నారు.