నవతెలంగాణ రెంజల్
మండల కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహంలో శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశమునందున విద్యార్థులు పరిసరాల పరిశుభ్రతం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అత్యవసర సమయంలో ఓఆర్ఎస్ పాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలని ఆయన వారికి ఓ ఆర్ ఎస్ పాకెట్లను అందజేశారు. అత్యవసరమైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి మందులు తీసుకోవాలని ఆయన సూచించారు. దోమల వల్ల మలేరియా, టైఫాయిడ్, చికెన్ గునియా, డెంగ్యూ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, విద్యార్థులు దోమల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణ అధికారి కరిపే రవీందర్, ఆరోగ్య కార్యకర్త శాంతకుమారి, ఆశా వర్కర్ సుజాత తదితరులు పాల్గొన్నారు