ఆదిలాబాద్ ఆర్టీసీ ఉద్యోగులకు ఆరోగ్య పరీక్షలు..

Health tests for Adilabad RTC employeesనవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
ఆర్టీసీ ఉద్యోగుల విధులు ఒత్తిడితో కూడుకున్నావని దాన్ని అధిగమించేలా ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తార్నాక హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శైలజ అన్నారు. గురువారం ఆర్డీసీ డిస్పెన్సరీలో ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఆర్టీసీ ఆర్ఎం సోలోమన్ తో కలిసి ఆమె ముఖ్య అథితిగా హాజరై వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా తార్నాక ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ శైలజ మాట్లాడుతూ.. ఒత్తిడితో కూడిన ఉద్యోగం ఆర్టీసీదన్నారు. అనేక రకాల వ్యాధులు వచ్చిన విధులు నిర్వహణలో వాటిని పట్టించుకోవడం లేదన్నారు. ఎండీ సజ్జనర్ గతంలో గ్రాండ్ హెల్త్ చాలెంజ్ లో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తే అనేక మంది వివిధ వ్యాధులో బాధపడుతున్నట్టు తెలిసిందన్నారు. కొందరికి స్టంట్, సర్జరీ కూడా చేశామని తెలిపారు. అంతే కాకుండా సీడీఈ క్యాటగిరిని ఏర్పాటు చేసి అందులో ఉన్న వారికి ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నామన్నారు. దీని కోసం డిపోల వారిగా ఇద్దరు హెల్త్ వాలంటీర్లను కూడా నియమించామన్నారు. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా ముఖ్యమన్నారు. అందుకే వారి కోసం వైద్య శిభిరం నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటి ఆర్ఎం ప్రవీణ్, ప్రణయ్, డిపో మేనేజర్ కల్పన, డిస్పెన్సరీ వైద్యులు కీర్తి. వెల్ఫేర్ బోర్డు సభ్యులు, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.