పారిశుద్యంతోనే ఆరోగ్యం: ప్రత్యేక అధికారి గీత

నవతెలంగాణ – వలిగొండ రూరల్
పారిశుద్యంతోనే ప్రజా ఆరోగ్యం సాధ్యం అవుతుందని స్థానిక ఎంపీడివో వెల్వర్తి గ్రామపంచాయతి  ప్రత్యేక అధికారి గీతా రెడ్డి అన్నారు. బుధవారం మండల వ్యాప్తంగా నిర్వహించిన పారిశుధ్య వారోత్సవాల సందర్భముగా వెల్వర్తిలో పారిశుధ్య సిబ్బందితో కలిసి పారిశుధ్య వారోత్సవాలలో వారు పాల్గొన్నారు. ఈసందర్భముగా వారు మాట్లాడుతూ పారిశుద్యం కోసం గ్రామాలలోని ప్రజలు అంతా సహకరించాలని గ్రామంలో చెత్తా చెదారం, మురుగు నీరు నిల్వకుండా పంచాయతీ సిబ్బంది పనిచేయాలని, ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరేందర్, కల్కురి రాములు, నామాల ఉప్పలయ్య, కల్కురి ముత్యాలు, బుడిగె కిష్టయ్య, భిక్షమయ్య, వెంకటేశం, యాదగిరి, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు