ప్రజలకు ఆరోగ్యమే దేవుడిచ్చిన వరం, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ లక్ష్మీనరసింహ స్ఫూర్తి ట్రెజరర్ బత్తిని రాజు గౌడ్ అన్నారు. మంగళవారం, యాదగిరిగుట్ట మండలం దాతర్ పల్లి, బత్తిని రాజు గౌడ్, తీగల రాము గౌడ్, జీడి సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో లయన్స్ ఇంటర్నేషనల్ వారు ఫ్రీ మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంప్ లో 365 మంది హెల్త్ చెకప్ చేయించుకున్నారు. వారిలో ఐ చెక్అప్ 165 మంది, జనరల్ చెకప్ 225 మంది, డెంటల్ చెక్అప్ 85 మంది, పెయిన్ రిలీఫ్ 105 మంది, ఆర్ బి ఎస్ చెక్అప్ 95 మంది ప్రజలు చెకప్ లు చేయించుకున్నారు. బత్తిని రాజు గౌడ్ మాట్లాడుతూ ప్రజల నుంచి స్పందన చాలా బాగా వచ్చిందని అన్నారు. డాక్టర్లు వచ్చిన ప్రజలకు హెల్త్ చెకప్ చేసి, మందులు ఇచ్చి, సలహాలు కూడా ఇచ్చారని తెలిపారు. గ్రామాలలోని ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే నిరంతర ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. గ్రామాలే దేశానికి పట్టుకోమని గ్రామాలలోని ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. నిరంతరం వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని తెలిపారు. నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తూనే ఉంటానని అన్నారు.