– ప్రత్యేక అధికారి మైలారం గంగాధర్
నవతెలంగాణ కమ్మర్ పల్లి
ఆరోగ్యానికి పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమని మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్, ప్రత్యేక అధికారి మైలారం గంగాధర్ అన్నారు. గురువారం మండలంలోని బషీరాబాద్ గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రత్యేక అధికారి గంగాధర్ ఆధ్వర్యంలో పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించారు. పాఠశాల ఆవరణ, పరిసరాల్లో పిచ్చి మొక్కలను తొలగించి, ఊడ్చి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారులు మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ సక్కారం అశోక్, ఎంపీటీసీ సభ్యురాలు తోట జ్యోతి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధర్ గారు,అంగన్వాడీ టీచర్లు, విఓఏ లు, ఆశ వర్కర్లు, మహిళ సంఘ సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.