తిమ్మాపూర్ అంగన్వాడి కేంద్రం 1లో ఆరోగ్య వైద్య శిబిరం..

నవతెలంగాణ – జన్నారం
మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రం 1లో గురువారం వైద్య   ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో గ్రామంలోని వృద్ధులకు  బిపి షుగర్ స్క్రీనింగ్, టెస్టులు చేసి మందుల పంపిణీ చేయడం జరిగింది. సందర్భంగా గ్రామస్తులకు పలు సూచనలు సలహాలు అందించారు. ఇంటి చుట్టూ మురుగు కాలువలు లేకుండా చూసుకోవాలన్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని  సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్ హెచ్ పి  సందీప్,  సూపర్వైజర్ జంగమ్మ, హెల్త్ అసిస్టెంట్ కొల్లూరి కమలాకర్ ఏఎన్ఎంజి మాధవి , ఆశా కార్యకర్త రజిత అంగన్వాడి టీచర్ సంజీవరాణి, ఆయా   గుండ మమత గ్రామ ప్రజలు పాల్గొన్నారు.