నవతెలంగాణ-గంగాధర: ఆరోగ్య తెలంగాణే సర్కారు లక్ష్యం పని చేస్తుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గంగాధర మండలం బూర్గుపల్లి గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన ఉప ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ పల్లెల అభివృద్ధే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం విరివిగా నిధులు వెచ్చిస్తుందని అన్నారు. గ్రామాల్లో మిషన్ భగీరథ పథకంతో మంచినీటిని అందిస్తున్నామని అందని గ్రామాలకు త్వరలో అందిస్తామని అన్నారు. పల్లెలు పచ్చదనంతో ఉండేందుకు హరితహారం కార్యక్రమం, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూటిక తీపించడం జరిగిందన్నారు. నూతనంగా ఏర్పడిన గ్రామాలకు గ్రామ పంచాయితీ భవనాలను మంజూరు చేయించడం జరిగిందన్నారు. కుల సంఘ భవనాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, రైతు వేదికలు ఏర్పాటు చేయడం జరిగాయని అన్నారు. స్మశాన వాటికల నిర్మాణంతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సాగి రమ్య-మహిపాల్ రావు, ఎంపీటీసీ దూలం లక్ష్మీ- శంకర్ గౌడ్, కొండగట్టు ఆలయ ధర్మకర్త పుల్కం నర్సయ్య, సింగిల్ విండో ఛైర్మన్ దూలం బాలగౌడ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రాజిరెడ్డి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేచినేని నవీన్ రావు, వెంకటాయపల్లి సర్పంచ్ మేఘరాజ్, వైద్యులు, బీఆర్ఎస్ నాయకులు ఆదిమల్లు తదితరులు పాల్గొన్నారు.