
రాజంపేట్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని మెడికల్ అధికారి విజయ మహాలక్ష్మి నిర్వహించారు. ఈ సందర్భంగా పీహెచ్సీ స్టాఫ్, మహిళలకు అనారోగ్య సమస్యలు, రక్త పరీక్షలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ వైద్యుల సూచనలు సలహాలు పాటించాలని, ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని మెడికల్ అధికారి సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ మంజూర్, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, తదితరులు ఉన్నారు.