పానీ పూరి లేదా గోల్గప్ప పేర్లతో భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన స్ట్రీట్ ఫుడ్. క్రిస్పీ పూరీలను మసాలా నీటితో నింపి తినే ఈ స్నాక్‌ను చాలా మంది ఇష్టపడతారు. సాధారణంగా ఇది జంక్ ఫుడ్‌గా పరిగణించబడినా, ఇంట్లో తయారు చేసుకుంటే పోషకాహారపరంగా మెరుగ్గా, పరిశుభ్రంగా ఉంటుంది. ఇంట్లో తయారు చేసుకున్న పానీ పూరి పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు, స్ట్రీట్ ఫుడ్‌గా తినడం వల్ల కలిగే ప్రమాదాలను విశ్లేషిస్తాం.
ఇంట్లో తయారు చేసుకున్న పానీపూరి పోషక విలువల పరంగా ఆలోచిస్తే, ఒక సర్వింగ్ (సుమారు 6 పూరీలు) లో కిందివి ఉంటాయి.
– గోధుమ లేదా రవ్వ పూరీలు – బలమైన కార్బోహైడ్రేట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
– ఉడికించిన బంగాళదుంప, శనగలు – ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు అధికంగా అందిస్తాయి.
– తయారీ మసాలా నీరు (పుదీనా లేదా చింతపండు నీరు)- వంటి పదార్థాలు విటమిన్ C యాంటీఆక్సిడెంట్లను జీర్ణశక్తిని మెరుగుపరచి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
– జీలకర్ర, ఉప్పు, అల్లం వంటి మసాల- వంటి పదార్థాలు కడుపు ఉబ్బరం, గ్యాస్‌ను తగ్గిస్తాయి, జీర్ణక్రియను మెరుగుపరిచి మటబాలిజాన్ని పెంచుతాయి.
– అధిక కొవ్వులు ఉండవు – బయట దొరికే లోతుగా వేయించిన స్నాక్స్‌తో పోలిస్తే, ఇంట్లో తక్కువ నూనెలో తయారు చేసుకోవచ్చు
– ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవచ్చు- మధుమేహ, బరువు తగ్గాలనుకునేవారు తమకు తగ్గట్టుగా తయారు చేసుకోవచ్చు.
అంచనా పోషక విలువ (6 పూరీలకు)
కేలరీలు : 150-200 Kcal
కార్బోహైడ్రేట్లు : 30-35g
ప్రోటీన్లు : 4-6g
కొవ్వులు : 5-7g
ఫైబర్ : 3-5స్త్రg
విటమిన్లు : విటమిన్ C, B-కాంప్లెక్స్, ఐరన్ అధికంగా ఉంటాయి.
ఖనిజాలు : మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం లభిస్తాయి.
స్ట్రీట్‌ఫుడ్‌గా పానీపూరి తినడం వల్ల సమస్యలు
ఇంట్లో తయారు చేసుకున్న పానీ పూరి ఆరోగ్యకరంగా ఉంటే, బయట అమ్మే పానీ పూరీలో పరిశుభ్రత లేకపోవడం వల్ల టైఫా యిడ్, కాలరా, డయేరియా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
ఉదాహరణ : హైదరాబాద్‌లో నిర్వహిం చిన పరిశోధన, వీధి వ్యాపారులు, మితమైన శుభ్రత కలిగిన ఆహార కేంద్రాలు, పానీపూరి సూక్ష్మజీవ గుణాన్ని అంచనా వేసింది. వీధి వ్యాపారుల దగ్గర అమ్మే పానీ పూరి అత్యధికంగా కలుషితమైనట్టు కనుగొన్నారు. 88శాతం నమూనాల్లో Escherichia coli, 80శాతంలోStaphylococcus aureus, 44 శాతంలో Bacillus cereus,, 16శాతం లోSalmonella, 24 శాతంలోShigella ఉండడం గుర్తించారు.
ఈ అధ్యయనాలు సమిష్టిగా వీధి వ్యాపారుల వద్ద అమ్మబడే పానీ పూరి అధిక స్థాయిలో బాక్టీరియాతో కలుషితమై ఉండే ప్రమాదాన్ని సూచిస్తున్నాయి.
ఇంట్లోనే ఆరోగ్యకరంగా, సురక్షితంగా
– శుద్ధి చేసిన లేదా మరిగించిన నీటిని ఉపయోగిస్తే – నీటి ద్వారా వచ్చే వ్యాధులను నివారించవచ్చు.
– చేతులు, వంట పాత్రలను శుభ్రంగా ఉంచండి. వ్యాధికారక క్రిములను అరికట్టడానికి.
– తాజా పదార్థాలను ఉపయోగించండి – పోషకాహారం సమద్ధిగా ఉండేలా చూసుకోండి.
– మళ్లీ మళ్లీ వాడిన నూనెతో డీప్‌గా వేయించకండి – అనారోగ్యకరమైన కొవ్వులు చేరకుండా చూసుకోండి.
– తయారీ తర్వాత వెంటనే తినేయాలి – చెడిపోవడం, బాక్టీరియా పెరగడం నిరోధించేందుకు.
పరిశుభ్రంగా ఉన్న పోషకాహారం ఎంచుకోండి. ఆరోగ్యంగా ఉండండి. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం.
Dr.Prathusha. Nerella
MD( General Medicine) CCEBDM; CCGDM; NLP; FID
Senior General Physician, Positive Psychologist certified Nutritionist, Diabetes And Lifestyle Expert, Pranic Healer Chiief Holistic Health Consultant And Medical Director @ Praveha General, Diabetes And Lifestyle Clinic – A Holistic Centre With Integrated Approach. Ph: 8897684912/040-49950314