నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
యోగా, ప్రాణాయామం సాధన ద్వారా ఆరోగ్యకర జీవనం సాధ్యమవుతుందని భారత ఆహార సంస్థ నల్గొండ డివిజనల్ అధికారి సుశీల్ కుమార్ సింగ్ అన్నారు.
అంతర్జతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం సంస్థ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. యోగా కేవలం శారీరక పరమైన స్వస్థత చేకూర్చడమే కాక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుందనీ తద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని పేర్కొన్నారు. ప్రాచీన సమాజం మన ఆధునిక సమాజానికి ఇచ్చిన అత్యంత అమూల్యమైన సంపదగా యోగాను అభివర్ణించిన ఆయన ప్రతి ఒక్కరూ యోగా సాధనను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని అభిలషించారు. కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులు యోగా సాధన చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులు రఘుపతి, కృష్ణవేణి, సుమిత్, అజయ్, స్వాతి, యోగా శిక్షకులు సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.