కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా– 22న పరిశీలిస్తామన్న రౌస్‌ అవెన్యూ కోర్టు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ లిక్కర్‌ స్కాం మనీలాండరింగ్‌ కేసులో రెగ్యూలర్‌ బెయిల్‌ కోసం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ కేసును విచారిస్తోన్న రౌస్‌ అవెన్యూ కోర్టు స్పెషల్‌ జడ్జి కావేరి బవేజా మంగళవారం సెలవులో ఉండడంతో ఈ పిటిషన్‌ విచారణను ఈనెల 22కు వాయిదా వేస్తున్నట్లు కోర్టు వెల్లడిం చింది. సీబీఐ కేసులో తాజాగా కవిత దాఖలు చేసిన రెగ్యూలర్‌ బెయిల్‌ పిటిషన్‌తో కలిపి ఈ పిటిషన్‌ ను విచారించనున్నట్టు స్పష్టం చేసింది.