నవతెలంగాణ-గోవిందరావుపేట : ఇంతకాలం ఎంతో ప్రేమగా సహకరించిన మండల ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని పసర ఎస్ ఐ షేక్ మస్తాన్ అన్నారు. మంగళవారం మండలంలోని పసర పోలీస్ స్టేషన్లో బదిలీపై వెళుతున్న ఎస్ ఐ షేక్ మస్తాన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఎస్ ఐ మండల ప్రజలందరికీ హార్దిక అభినందనలు తెలియచేసారు. గత ఎనిమిది నెలల కాలంలో అసెంబ్లీ ఎన్నికలు విజయవంతం నిర్వహించడంలో లో కానీ, మేడారం జాతర సమయం లో అయిన ప్రజలు అందించిన సహహకరం మరువలేనిదని అన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఎవరికి ఎలాంటి అవసరం వచ్చిన ఎస్ ఐ గా సంప్రదించవచ్చని తెలియచేసారు. మరో మారు ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు మస్తాన్ కృతజ్ఞతలు తెలిపారు.