– వరంగల్ మార్కెట్‌లో దేశిరకం మిర్చి క్వింటా రూ.39వేలు
నవతెలంగాణ కాశిబుగ్గ
వరంగల్ (ఏనుమాముల) వ్యవసాయ మార్కెట్ మిర్చి యార్డులో బుధవారం మిర్చి(ఎర్ర బంగారం) పోటెత్తింది. యార్డుకు సుమారు 50వేలకు పైగా మిర్చి బస్తాలు అమ్మకానికి వచ్చాయి. ఈ సీజన్ ప్రారంభం నుంచి ఇంత పెద్దఎత్తున మిర్చి రావడం ఇదే తొలిసారి కావడంతో వ్యాపారులు, కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. దేశీ రకం మిర్చికి గరిష్టంగా క్వింటా ధర రూ.39వేలు పలుకగా, తేజ రకం రూ.21వేలు, వండర్ హాట్ రూ.22వేలు, యూఎస్341 రూ.20,500, దీపిక రకం మిర్చి క్వింటాకు రూ.22,500 ధర పలికింది. శుక్రవారం దేశవ్యాప్త సమ్మె ఉండటం.. శని, ఆదివారాలు మార్కెట్ యార్డు బంద్ ఉండటం, మేడారం జాతర దగ్గర పడటంతో రైతులు పెద్దఎత్తున తమ పంట ఉత్పత్తులను అమ్మడానికి మార్కెట్‌కు తీసుకొస్తున్నారు.