నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ అటవీప్రాంతంలో తాడిచెర్ల విద్యుత్ సరఫరా అవుతున్న 11 కెవి విద్యుత్ స్టభం నుంచి భారీగా పొగ, మంటలు సెలరేగాయి. దీంతో మంల్లారం, తాడిచెర్ల, పెద్దతూండ్ల, చిన్నతూండ్ల గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిసిపోయింది. విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోని మంటలు సెలరేగినా విద్యుత్ స్తంభానికి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.