
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలంలో గడిచిన 24 గంటల్లో 102.4 మి.మీ వర్షపాతం నమోదు అయినట్లు తహశీల్దార్ లూదర్ విల్సన్ తెలిపారు. బుధవారం సాయంత్రం నుండి గురువారం ఉదయం వరకు సంభవించిన భారీ వర్షానికి పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలు వర్షపు వరద నీటితో జలమయం అయ్యాయి.అక్కడక్కడ చెట్లు విరిగి విద్యుత్ లైన్ పై పడడంతో విద్యుత్ సరఫరా తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. నియోజక వర్గంలోని మండలాల్లో నమోదు అయిన వర్షపాతం ఇలా ఉంది.
మండలం వర్షపాతం
అశ్వారావుపేట 102.4
దమ్మపేట 98.4
చండ్రుగొండ 60.2
అన్నపురెడ్డిపల్లి 47.2
ములకలపల్లి 14.2
మొత్తం 322.4