రెండు గంటలపాటు భారీ వర్షం..

– ఒక్కసారిగా ఏకధాటిగా వర్షం
– లోతట్టు ప్రాంతాలు జలమయం
– ఉరుములు, మెరుపులతో వర్షం
నవతెలంగాణ కంటేశ్వర్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా గాలి దుమారం లేచి ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. నిజామాబాద్, పిట్లం, బిచ్కుండ, వర్ని, రుద్రూర్, బాన్సువాడ, లింగంపేట, ధర్పల్లి తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. మరొపక్క వాతావరణం చల్లబడడంతో ప్రజలు వేసవి ఉక్కపోతలకు ఉపశమనం పొందారు. నిజాంబాద్ జిల్లా కేంద్రంలో సుమారు రెండు గంటల పాటు వర్షం కురగా ఒక్కసారిగా ఏ గజాటిగా వర్షం కురిసింది ఈ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్, కాలనీ డీత్రీ కెనాల్కట్ట మాలపల్లి, అర్సపల్లి, కేసీఆర్ కాలనీ, కంటేశ్వర్, ఆర్య నగర్, గాయత్రి నగర్ లో రోడ్ నెంబర్ 4, తదితర ప్రాంతాలతో పాటు ప్రాంతాలన్నీ నీటితో జలమేమయ్యాయి ప్రజలకు రాకపోకలకు సుమారు గంటన్నర పాటు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రైల్వే కమాన్ వద్ద పాత బ్రిడ్జి కొత్త బ్రిడ్జి క్రింద నీరు ఆగిపోవడంతో కొద్దిసేపటి వరకు అక్కడ రాకపోకలకు అంతరాయం కలిగినట్లు సంబంధిత అధికారులు తెలుపుతున్నారు. అలాగే నూతన కలెక్టరేట్ ప్రాంతంలో సైతం లోతట్టుగా ఉండడంతో నీరు నిలిచిపోయింది అలాగే రైల్వే స్టేషన్ లో బస్టాండ్ ఆవరణంలో రోడ్లన్నీ నీటితో జలమయమయ్యాయి. సుమారు 6 గంటలకు వర్షం ఆగిపోవడంతో సంబంధిత మున్సిపల్ అధికారులు వాటిని తొలగించే పనులు ఉన్నందున ఇప్పుడు నిజామాబాద్ నగరమంతా ప్రశాంతంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆదివారం 42.7/30.3 ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు.