బీర్కూర్ మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బీర్కూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న నాలుగు పలకల రోడ్డు జలమయం అయింది. బాన్సువాడకు వెళ్లే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. భారీ వర్షం కారణంగా రోడ్లపై వరద నీరు వచ్చి చేరడంతో రోడ్డుపై ఉన్న నీళ్లు ఇళ్లల్లోకి నీరు చేరింది. వర్షం ఉధృతికి వ్యవసాయ పిల్ల కాలువలు సక్రమంగా శుభ్రం చేయకపోవడంతో పాటు, పలుచోట్ల నాలాలపై నిర్మాణాలు చేపట్టడంతో వర్షం పడిన ప్రతీ సారి ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. పలుచోట్ల రోడ్లకు గండ్లు పడింది. వర్షం కురిసిందంటే లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి నెలకొందని, రోడ్డు భవనాల శాఖ అధికారులు ఇకనైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.