హైదరాబాద్‌లో భారీ వర్షం

– ఉదయం అకస్మాత్తుగా కురిసిన వాన
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం పలుచోట్ల అకస్మాత్తుగా గంటపాటు భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, బేగంపేట, సనత్‌నగర్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎర్రమంజిల్‌, కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌, మాదాపూర్‌, బాలానగర్‌, మెహదీపట్నం, టోలిచౌకి, యూస ఫ్‌గూడ, మాసా బ్‌ట్యాంక్‌, సికిం ద్రాబాద్‌, ఉప్పల్‌, రామంతపూర్‌, కోఠి, అబిడ్స్‌ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉద్యోగులు కార్యాల యాలకు, విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే సమయం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయింది. పంజాగుట్టలో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది, పోలీసులు డ్రయినేజీ మ్యాన్‌హౌల్స్‌ తెరిచి వరద నీరు పోయేలా చర్యలు తీసుకున్నారు.