– ఉట్నూర్‌లో రాళ్ల వాన
నవతెలంగాణ- విలేకరులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం కురింది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో సుమారు గంట సేపు వర్షం పడింది. ఈదురుగాలులు రావడంతో గ్రామాల్లో ఇంటి పై కప్పులు, పశువుల పాకలు, విద్యుత్ స్తంభాలు, వృక్షాలు నేలకొరిగాయి. రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. అదే విధంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్, లింగపూర్, సిర్పూర్(యు) మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. లింగాపూర్‌లో పలు ఇండ్ల పై కప్పులు ఎగిరిపోయాయి. ఉట్నూర్ మండలంలోనూ ఈదురు గాలులతో కూడిన రాళ్లవాన పడింది.